Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు

Supreme Court Warning to AP Government on conducting of AP Inter Exams 2021
x

అత్యున్నత న్యాయస్థానం (ఫైల్ ఇమేజ్)

Highlights

Supreme Court: ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర ఆగ్రహం * ఒక్క విద్యార్థి చనిపోయినా రూ. కోటి పరిహరం ఇవ్వాలి- సుప్రీంకోర్టు

Supreme Court: ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిడ్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణతో ఒక్క విద్యార్థి చనిపోయినా.. ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. కరోనాతో ఒక్క విద్యార్థి చనిపోయినా.. ఆ విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని తెలిపింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో క్లారిటీ లేదని.. పరీక్షల నిర్వహణ, సిబ్బంది వివరాలేవీ అఫిడవిట్ లో క్లారిటీగా ఇవ్వలేదని కోర్టు వ్యాఖ్యనించింది.

పరీక్షల నిర్వహణకు దాదాపు 34 వేలకు పైగా గదులు అవసరం అవుతాయని.. అసలు ఆ విషయాన్ని ఆలోచించారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని తెలిపింది. పరీక్షలు నిర్వహించాం.. పని అయిపోయిందనుకోలేం కదా అంటే సరిపోదని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాకే పరీక్షల నిర్వహణకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories