Nandigam Suresh: నందిగం సురేష్‌కు సుప్రీంకోర్టులో షాక్.. ముందస్తు బెయిల్ తిరస్కరణ

Supreme Court Rejects Nandigam Suresh Bail Plea in Mariamma Murder Case
x

Nandigam Suresh: నందిగం సురేష్‌కు సుప్రీంకోర్టులో షాక్.. ముందస్తు బెయిల్ తిరస్కరణ

Highlights

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

2020లో తూళ్లూరు మండలం వెలగపూడికి చెందిన మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేశారు. తనకు వస్తున్న పెన్షన్‌ను నిలిపివేశారని, ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని అప్పటి సీఎం జగన్‌‌ను మరియమ్మ దూషించింది. దీంతో సురేష్ అనుచరులు దాడి చేయడంతో ఆమె చనిపోయింది. పోలీసులు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండడంతో కేసు విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి నారా లోకేష్‌ను మరియమ్మ కుమారుడు కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. మరియమ్మ మృతి కేసు వివరాలను తెలియజేశారు. దీంతో ఈ కేసులో నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

కేసు తీవ్రత నేపథ్యంలో సురేష్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సురేష్ తన పాత కేసుల వివరాలను ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించింది. ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయకపోవడంతో తాము కూడా జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో చార్జిషీటు కూడా దాఖలైనందున బెయిల్ కోసం మరోసారి ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని చెబుతూ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories