స్కిల్ కేసులో చంద్రబాబుకు సుప్రీంలో ఊరట

స్కిల్ కేసులో చంద్రబాబుకు సుప్రీంలో ఊరట
x
Highlights

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు జనవరి 15న కొట్టివేసింది.

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు జనవరి 15న కొట్టివేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి జైలులో ఉన్నారు. 2023 నవంబర్ 20న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో 2023 నవంబర్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై పలుసార్లు సుప్రీంకోర్టు విచారించింది.

చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంతో ఈ కేసుపై ప్రభావం ఉంటుందని అప్పట్లో ప్రభుత్వం వాదించింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుపై చార్జీషీట్ దాఖలు చేసిన విషయాన్ని ఏపీ ప్రభుత్వ తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. చార్జీషీట్ దాఖలైనందున ప్రస్తుతం ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును 2023 నవంబర్ 9న ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేశారు.రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై కేసు నమోదు చేశారని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories