Meat Shops: మాంసం ప్రియుల‌కు షాక్..రేపు దుకాణాలు బంద్

Meat Shops Closed in Visakhapatnam
x

Meat Shops (Thehansindia)

Highlights

Meat Shops: కరోనా వ్యాప్తి కార‌ణంగా ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు.

Meat Shops: కరోనా వ్యాప్తి కార‌ణంగా ప్ర‌జ‌లు ఇళ్ల‌లోనుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇక రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డాని పండ్లు, డ్రైఫ్రూట్స్ తీనే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. మాంసం ప్రీయులు అయితే ముక్క‌లేనిద ముద్ద దిగ‌డంలేదు. దీంతో ఆదివారం వ‌చ్చిందంటే మాంసం కోసం షాపుల ముందు జ‌నం బారులు తీరుతున్నారు. ఈ నేప‌థ్యంలో మాంసం దుకాణాల వ‌ద్ద జ‌నం గుమిగూడ‌టంతో క‌రోనా వ్యాప్తి కార‌ణం అవుత‌న్నారు.

దీంతో మాసం ప్రీయుల‌కు మింగుడు ప‌డ‌దని వార్త అందించారు అధికారులు. వారికి షాక్ ఇస్తూ.. ఆదివారం మాంసం షాపులు మూసేయాల‌ని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రేపు మాసం షాపులు మూసివేయ‌నున్నారు. అయితే ఇదీ కేవలం విశాఖ లో మాత్ర‌మే.

కొవిడ్ ఉద్ధృతి కట్టడి చర్యల్లో భాగంగా గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న (ఆదివారం) మాంసం, సీఫుడ్‌ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ సృజన వెల్లడించారు. మాంసం దుకాణాల వద్ద జనం గుమిగూడటంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నగరంలో గత ఆదివారం కూడా మాంసం విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories