Suman Bose: సీమెన్స్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ బోగస్

Suman Bose Comments On AP Skill Development Case
x

Suman Bose: సీమెన్స్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ బోగస్ 

Highlights

Suman Bose: ఈ స్కీంలో సీమెన్స్ కంపెనీ సాఫ్ట్‌వేర్ , హార్డ్‌వేర్ ఇచ్చింది

Suman Bose: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైనదని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్. ప్రాజెక్టు చాలా విజయవంతమైందని చెప్పారు. 2లక్షల 32వేల మందికి సర్టిఫికెట్ ఇస్తే.. వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారన్నారని సుమన్ బోస్ స్పష్టం చేశారు. ఈ స్కీమ్ కింద...రాష్ట్రంలోని 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్‌లు ఏర్పాటు చేసామన్నారు ఆయన. సీమెన్స్ తో ఒప్పందం జరగలేదని చెప్పడం పూర్తిగా అబద్ధమన్నారు. 2016లో తాను కంపెనీకి రాజీనామా చేశాను, కంపెనీ అభ్యర్థన మేరకు ఏడాదిన్నర పాటు కొనసాగానన్నారు. ఈ స్కీంలో సీమెన్స్ కంపెనీ సాఫ్ట్‌వేర్ , హార్డ్‌వేర్ ఇచ్చిందన్నారు. ప్రాజెక్ట్ అందించిన అంతిమ ఫలితాలు చూసి మాట్లాడాలని, ట్రైనింగ్ సెంటర్లు చూడకుండానే అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారని సుమన్ బోస్ ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories