విశాఖలోని మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ తారకేష్‌ ఆకస్మిక బదిలీ

విశాఖలోని మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ తారకేష్‌ ఆకస్మిక బదిలీ
x
Highlights

* అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ * డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయాలని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి * రూల్స్‌కు విరద్ధంగా ఉండడంతో తిరస్కరించిన తారకేష్

విశాఖలోని మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ తారకేష్‌ ఆకస్మిక బదిలీ వ్యవహారం కలకలం రేపుతోంది. తారకేష్‌ను బదిలీ చేస్తూ.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సోమవారం అర్థరాత్రి ఆదేశాలు వచ్చాయి. ఆ శాఖ ఐజీ ఆఫీసులో రిపోర్టు చేయాలంటూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయాలని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి చేశారు. దాన్ని తారకేష్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే బదిలీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా సబ్‌రిజిస్ట్రార్‌కు అర్థరాత్రి ఫోన్‌ చేసి బూతులు తిట్టడంతో ఆ ఉన్నతాధికారిపై మధురవాడ ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. తమపై కక్షపూరితంగా ఏసీబీ అధికారులు వ్యవహరించారంటూ.. సబ్‌ రిజిస్ట్రార్‌ తారకేష్‌ వీడియోలతో ఫిర్యాదు చేశారు. అవినీతి నిరోధక శాఖాధికారులే తప్పు చేశారని ఆ వీడియోలో అప్పటి మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పడం వైరల్‌ అయింది. ఈ వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ తారకేష్‌ను అప్పటి డీఐజీ బదిలీ చేశారు. తప్పు చేయని వ్యక్తిని ఎందుకు బదిలీ చేశారంటూ.. ఏకంగా డీఐజీనే ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఇప్పుడు మళ్లీ బదిలీ వ్యవహారం తెరపైకి రావడంతో మధురవాడలో మళ్లీ ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories