Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతం

Strike Against Privatisation of Vizag Steel Plant
x

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతం

Highlights

Vizag Steel Plant: ఉక్కు కార్మిక గర్జనతో విశాఖ రణరంగాన్ని తలపిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.

Vizag Steel Plant: ఉక్కు కార్మిక గర్జనతో విశాఖ రణరంగాన్ని తలపిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. స్టీల్ ప్లాంట్ త్రిష్ణా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జాతీయ స్థాయి కార్మిక సంఘ నాయకులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో స్టీల్ నెహ్రూ పార్క్ నుంచి నిరసన ప్రదర్శన ప్రారంభం కానుంది. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయింపు ప్రైవేటీకరణ నిలిపి వేయాలన్న డిమాండ్‌లతో ఉద్యమం ఉధృతం చేస్తున్నారు.

మరోవైపు ఉక్కు ఉద్యమంలో గాజువాకకు చెందిన స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ తీవ్ర కలకలం రేపింది. ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలమని లేఖలో రాశారు శ్రీనివాసరావు. కాసేపట్లో జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వద్దని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ ఉక్కు ఉద్యమం కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నా. ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి అవుతా. నా ప్రాణత్యాగం నుంచే ఈ పోరాటం మొదలు కావాలని లేఖలో రాశారు శ్రీనివాసరావు. ఉక్కు కార్మిక గర్జన నేపధ్యంలో శ్రీనివాస రావు లేఖ తీవ్ర కలకలం రేపుతోంది.

ఇక స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్ సూసైడ్ నోట్‌పై నారా లోకేష్ స్పందించారు. ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేస్తున్నా అన్న లేఖను చూస్తే బాధేస్తుదని వ్యాఖ్యానించారు. కార్మికులు ధైర్యంగా ఉండాలన్న లోకేష్ ఏ ఒక్క కార్మికుడూ ప్రాణత్యాగం చేసుకోవద్దని వెడుకుంటున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories