ఏపీలో మరో ఆలయంలో విగ్రహ ధ్వంసం

ఏపీలో మరో ఆలయంలో విగ్రహ ధ్వంసం
x
Highlights

* విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహంపై దాడి * శిరస్సు భాగాన్ని తొలగించిన దుండగులు * ఘటనపై మండిపడుతోన్న హిందూ ధార్మిక సంఘాలు

ఏపీలో విగ్రహాల విధ్వంస కాండ కొనసాగుతోంది. తాజాగా విజయనగరం జిల్లాలో రాములవారి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ద్వంసం చేయటంతో0. ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో హిందూ ధార్మిక సంఘాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే కుట్ర జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో మరో ఆలయంపై దుండగుల దాడి వివాదం రేపుతోంది. తాజాగా విజయనగరం జిల్లాలో మరో దేవుడి విగ్రహం దాడికి గురైంది. 400 వందల యేళ్ళ చరిత్ర కలిగిన రామతీర్థంలోని కోదండరామస్వామి ఆలయంలో. శ్రీరాముని విగ్రహం శిరస్సు భాగాన్ని గుర్తు తెలియని ద్వంసం చేశారు. ఈ ఘటనపై హిందూ ధార్మిక సంఘాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. సీఎం పర్యటనకు ముందే విగ్రహ ధ్వంసం ఘటన జరగడంతో జిల్లాలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకే కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవటంతో ఆలయాలపై దాడులు పరిపాటిగా మారుతున్నాయని ప్రతిపక్షాలతో పాటు హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రామతీర్థం పరిరక్షణ పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసనంద స్వామి డిమాండ్ చేశారు. ఈ దాడితో హిందువుల మనోభావాలు దెబ్బతీసే కుట్ర జరుగుతోందని మరోమారు రుజువైందన్నారు.

మరోవైపు ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. గతంలో జరిగిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరిగేవా అంటూ ప్రశ్నించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ఈ ఘటనపై స్పందించారు. అదే హిందూ విగ్రహాల ధ్వంసం సీఎంకు సిగ్గుచేటుగా అనిపించటం లేదా అని ప్రశ్నించిన ఆయన. అదే జీసస్ విగ్రహం ధ్వంసమైతే క్షణాల్లో నిందితులను పట్టుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories