రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన పల్నాడు హత్య

Statewide Debate on Palnadu Death Issue
x

Representational Image

Highlights

* గుంటూరు జిల్లా దాచెపల్లి (మం) మాజీ సర్పంచ్ అంకులు హత్య * టీడీపీ నేత హత్య కావడంతో రేగిన దుమారం

రాష్ట్రం వ్యాప్తంగా చర్చగా మారిన పల్నాడు హత్య ఏమయ్యింది? రాజకీయంగా రచ్చగా మారిన కేసులో పోలీసులు ఎందుకు ఏమీ తేల్చలేకపోతున్నారు? ఇప్పటి వరకు విచారణ లో అసలేం జరిగింది? ఇదీ ఇప్పుడు జిల్లాలో మాజీ సర్పంచ్ అంకులు హత్యపై చర్చ.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో పెద గార్లపాడు మాజీ సర్పంచ్ పురం శెట్టి అంకులు హత్యకు గురయ్యారు. హతుడు మాజీ సర్పంచ్ కావడం, టీడీపీ నేతగా ఉండడంతో ఈ హత్య పెద్ద దూమారం రేపింది. ఇది పూర్తిగా రాజకీయ హత్యే అంటూ కుటుంబ సభ్యులు, నేతలు ఆరోపించారు. హత్యపై 14 మందిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసు శాఖలోని ఓ అధికార సహకారంతో హత్య జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో హత్య కేసు ఛేదించడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

ఎవరో ఫోన్ చేసిన మీదటే మృతుడు అక్కడికి వెళ్లిన నేపథ్యంలో ఇది తెలిసిన వారి పనిగానే అంతా భావించారు. అయితే ఆ సమయంలో మృతుడి ఫోన్ నిందితులు తీసుకు వెళ్లారని.. కాల్ డేటా ద్వారా విచారణ చేపడుతున్నామని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొందిరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసినా ఇతర వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. దీంతో దర్యాప్తు తీరుపై టడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా కలకలం రేపిన కేసులో ఇప్పటికి నిందితులు ఎవరు? హత్యకు కారణాలు ఏంటి అనేది బయటకు రాలేదు. అయితే బాధితులు ఇచ్చిన కేసుపై ఇప్పటికీ అరెస్టులు జరగలేదు. కేవలం కాల్ డాటా తీస్తే మొత్తం వివరాలు వచ్చే కేసులో ఇంత జాప్యం ఎందుకన్నది కుటుంబ సభ్యుల ప్రశ్న. ఐతే, పోలీసులు నిత్యం కొందరిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత పకడ్బందీగా కేసులో వివరాలు రాబట్టాలని ఉన్నతాధికారులు ఉన్నారని, అందుకే జాప్యం జరుగుతుందని స్థానిక పోలీసులు చెపుతున్నారు. అయితే స్వయంగా ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసిన కేసులో జాప్యం ఇతర చర్చకు కారణం అవుతుంది.

ఈ కేసు విషయంలో త్వరగా స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కాసు కూడా డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఈ హత్యకు తనకు సంబంధం లేదని తేలిపోతుందని ఆయన భావిస్తున్నారు. మరి పోలీసులు వీటన్నింటికి ఎప్పుడు ముగింపు పలుకుతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories