Tirumala: భరతనాట్యం చేస్తూ తిరుమలకు.. శ్రీవారికి యువకుడి నృత్య నీరాజనం

Srivari Devotee Dr. Krishna Vasu Reached Tirumala With Bharatanatyam
x

Tirumala: భరతనాట్యం చేస్తూ తిరుమలకు.. శ్రీవారికి యువకుడి నృత్య నీరాజనం

Highlights

Tirumala: భరతనాట్యం చేసుకుంటూ మెట్లమార్గంలో తిరుమల చేరుకున్న కళాకారుడు

Tirumala: భరతనాట్యం చేసుకుంటూ మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నాడు ఓ కళాకారుడు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ కృష్ణవాసు శ్రీకాంత్... పల్నాడులోని కోటప్ప కొండ విద్యాలయంలో సాంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాధారణంగా నడుస్తూ వెళ్తే తిరుమలకు చేరుకోవడానికి గంటన్నర నుంచి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది.

అయితే కళాకారుడు శ్రీకాంత్ మాత్రం భరతనాట్యం చేసుకుంటూ 75 నిమిషాల్లోనే మెట్లమార్గం గుండా తిరుమల పైకి చేరుకున్నాడు. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ భక్తులను ఆయన ఆకట్టుకున్నారు. నేటి యువతకు సాంస్కృతిక సంప్రదాయ కళల పట్ల అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినట్టు శ్రీకాంత్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories