Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. ఎప్పటినుంచంటే..!

Srivari Brahmotsavam in Tirumala
x

Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. ఎప్పటినుంచంటే..!

Highlights

Tirumala Brahmotsavalu 2024: అక్టోబరు 4 నుండి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirumala Brahmotsavalu 2024: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల శోభ మొదలైంది. అక్టోబర్ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తొమ్మిది రోజులు పాటు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి.

నిత్యకళ్యాణం పచ్చతోరణమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎనలేని ప్రత్యేకత ఉంది. తొమ్మిది రోజుల పాటు ఆ దేవదేవుడే భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే..ఈ మహాత్తర ఘట్టానికి చాలా ప్రాధాన్యత వుంది. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం కన్యామాసంలో, చంద్రమానం ప్రకారం అశ్వీయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ముగిసేవిధంగా 9రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభావంగా నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కనులపండుగగా జరుగుతాయి. ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజాఅవరోహణంతో ముగుస్తాయి. చాంద్రయానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి అధికమాసం వస్తుంది.. ఇలా వచ్చిన సందర్భాలలో కన్యామాసంలో ఒక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో మరో బ్రహ్మోత్సవం... ఇలా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా అక్టోబర్ నెల 3వ తేది అంకురార్పణ అనే తోలి ఘట్టంతో ఉత్సవాలు లాంచనంగా ప్రారంభం అవుతాయి. అనంతరం 4వ తేది సాయంత్రం ధ్వజరోహణం అనే కార్యక్రమ తర్వాత వాహనసేవలు మొదలయావుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories