TTD Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Srivari Arjita Seva tickets released today
x

TTD Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Highlights

TTD Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ వెబ్ సైట్లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీన జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకువస్తారు.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల, దర్శన టికెట్ల కోటా నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే..నేడు ఆర్జిత సేవల కోటాను విడుదల చేస్తారు. వీటిని కొన్నింటిని ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోటా కింద అక్టోబర్ 21న అందుబాటులోకి తీసుకువస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను నేడు ఉదయం 10గంటలకు టీటీడీ, ఆన్ లైన్లో రిలీజ్ చేస్తుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10గంటల వరకు ఆన్ లైన్లో నమోదు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ టికెట్లు పొందినవారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12గంటలలోగా డబ్బు చెల్లించినవారికి లక్కీడిప్ లో టికెట్లు మంజూరు అవుతాయి.

స్పెషల్ దర్శనం రూ. 300టికెట్లు

అక్టోబర్ 24వ తేదీన జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకువస్తారు. తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను అక్టోబర్ 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లైన్లో రిలీజ్ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories