శ్రీశైలం దేవస్థానానికి ఏడు I.S.O. ధృవీకరణ పత్రాలు

Srisailam Temple Gets ISO Certificates
x

శ్రీశైలం దేవస్థానానికి ఏడు I.S.O. ధృవీకరణ పత్రాలు

Highlights

Srisailam: పత్రాలను అందజేసిన అంతర్జాతీయ సంస్థ హెచ్‌వైఎం

Srisailam: శ్రీశైలం దేవస్థానానికి పలు విభాగాల్లో ఏడు I.S.O. ధృవీకరణ పత్రాలను అంతర్జాతీయ సంస్థ హెచ్‌.వై.ఎం రెన్యువల్‌ చేసింది. గతంలో జారీచేసిన ధ్రువపత్రాల కాలపరిమితి ముగియడంతో వాటిని పునరుద్ధరించింది. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చేతులమీదుగా ఆలయ ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఈ పత్రాలను అందుకున్నారు.

దేవస్థాన పరిపాలనా విధి విధానాలు, నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, అన్నదానం, ప్రసాదాల తయారీలో నాణ్యతకు గాను ఫుడ్‌సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ సిస్టం, ఎల్‌ఈడీ దీపాలు, సౌరశక్తి వినియోగానికి ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సిస్టం, సీసీ కంట్రోల్‌ రూం నిర్వహణ, ఆధునిక సాఫ్ట్‌వేర్‌, సాంకేతికత వినియోగానికి ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, స్థానికులు, భక్తులకు అందిస్తున్న వైద్యసేవలకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ మెజర్స్‌, పారిశుద్ధ్య నిర్వహణకు గుడ్‌ హైజెనిక్‌ ప్రాక్టీసెస్‌ ధ్రువీకరణలు అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories