వైఎస్‌ టైంలో చక్రంతిప్పిన మాజీ మంత్రి బాలరాజు ఇప్పుడెక్కడ?

వైఎస్‌ టైంలో చక్రంతిప్పిన మాజీ మంత్రి బాలరాజు ఇప్పుడెక్కడ?
x
Highlights

వైఎస్‌ టైంలో మంత్రిగా చక్రంతిప్పారు. ఉత్తరాంధ్రలో తన పేరుకు తగ్గట్టే రారాజుగా వెలిగారు. కొండాకోన గిరిజనులకు ప్రియమైన నాయకుడిగా దుమ్మురేపారు. కానీ...

వైఎస్‌ టైంలో మంత్రిగా చక్రంతిప్పారు. ఉత్తరాంధ్రలో తన పేరుకు తగ్గట్టే రారాజుగా వెలిగారు. కొండాకోన గిరిజనులకు ప్రియమైన నాయకుడిగా దుమ్మురేపారు. కానీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న చందంగా, ఆ‍యన కూడా ఒకే ఒక రాంగ్‌ స్టెప్ వేశారు. దీంతో పీకల్లోతు ఊబిలో కూరుకుపోయినట్టుగా బెంగపడుతున్నారు. పక్క నియోజకవర్గాల్లో తన సహచరులు మంత్రులుగా దూసుకుపోతుంటే, ఈయన మాత్రం పొలిటికల్ తెరపై కనుమరుగు అవుతానేమోనని దిగులు చెందుతున్నారు. ఇంతకీ ఆ‍యన ఫీలవుతున్న ఆ రాంగ్‌ స్టెప్ ఏంటి?

ఉత్తరాంధ్రా జిల్లాలో క్రీయాశీలక రాజకీయాలు చేసి, తనదైన ముద్రవేసుకున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పొలిటికల్ జర్నీ, ఎటు పయనిస్తోంది?

రాజశేఖరుడి హయాంలో రారాజులా చక్రం తిప్పిన బాలరాజు చరిత్రంతా గతమేనా?

పవన్ పొలిటికల్ టీంలోకి ఎంట్రీ ఇచ్చినా, పవర్ పాలిటిక్స్ రాజుకు కలిసి రాలేదా?

ఇప్పుడు ఇదే అంశం ఉత్తరాంధ్రా రాజకీయంలో ఘాటైన చర్చను రేకెత్తిస్తోంది. మాజీ మంత్రి బాలరాజు భవిత్యం ఏంటన్న సందిగ్ధం కొనసాగుతోంది.

రాజకీయాల్లో ఒక్కోసారి స్టెప్పులు రాంగ్ అవుతూంటాయి. తడబాటు అయినా, పొరపాటు చేసినా కూడా వెనక్కు తీసుకోలేరు. అలాంటి తప్పే విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనకు విశాఖ ఏజెన్సీలో పట్టు లేదు. ఆ మాటకొస్తే జిల్లాలోనే బలం అంతగా లేదు. అటువంటిది సీనియర్ నేతగా ఉన్న బాలరాజు నూతనంగా ఆవిర్భవించిన జనసేన తీర్థం పుచ్చికుని సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. దీంతో బాలరాజు అనుచరవర్గం చుక్కాని లేని నావలా తయారైంది.

కాంగ్రెస్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ‌ శాఖ మంత్రిగా సేవలు అందించి, ఉత్తరాంధ్రాలో తిరుగేలేని నేతగా ముద్రవేసుకున్నారు బాలరాజు. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోను చక్రం తిప్పారు. 2014లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూడటంతో రాజకీయ ప్రస్థానం తిరోగమనమైంది. అయితే 2019లో పవన్ కళ్యాణ్ పార్టీ, ఆయనకు చీకట్లో చిరుదీపంలా కనపడింది. దీంతో నూతనోత్సాహంతో రెపరెపలాడిన జనసేన నుంచి పోటీ చేసినా, పవర్ పాలటిక్స్ బాలరాజుకు కలసి రాలేదు. పాడేరులో ఓడిపోయారు బాలరాజు.

ఏజెన్సీలో పట్టులేని జనసైన్యంలోనికి వెళ్లి తప్పు చేశానా అని, తీరిగ్గా చింతిస్తున్నారు బాలరాజు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉత్తరాంధ్రలో ఒక వెలుగు వెలిగిన బాలరాజు ప్రస్థానం ఎటు మలుపు తిరుగుతుందన్నది ఆయన క్యాడర్‌కు సైతం అర్థంకావడం లేదు. చూడాలి ముందు ముందు బాలరాజు రాజకీయ జీవితం పునరుజ్జీవమవుతుందో గత చరిత్ర ఘనమైనదిగానే మిగిలిపోతుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories