KGBV: ప్రేయర్ కు సకాలంలో రాలేదని.. 18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరింపు

KGBV: ప్రేయర్ కు సకాలంలో రాలేదని..  18 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరింపు
x
Highlights

Kasturba Gandhi Balika Vidyalaya: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో దారుణం జరిగింది.

Kasturba Gandhi Balika Vidyalaya: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో దారుణం జరిగింది. కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో ప్రేయర్‌కి అటెండ్ కాలేదన్న నెపంతో 18 మంది విద్యార్థినుల తల వెంట్రుకలను కత్తెరించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు అక్కడ నీరు అందుబాటులో లేదు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు.

వీరిలో 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినుల్లో నలుగురిపై చేయి చేసుకున్నారు సాయిప్రసన్న. అక్కడితో ఆగకుండా.. విద్యార్థినులను ఎండలో నిల్చోబెట్టడంతో ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. మధ్యాహ్న భోజన విరామంలో 18 మంది విద్యార్థినుల జుత్తును కొద్దికొద్దిగా ఆమె కత్తిరించారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశామని బాధిత విద్యార్థినులు ఆదివారం తెలిపారు.

దీనిపై ప్రత్యేక అధికారిణి మాట్లాడుతూ.. ఈ నెల 15న విద్యార్థినులు ప్రతిజ్ఞకు, తరగతులకు కూడా రాలేదని పేర్కొన్నారు. ఒంటి గంట వరకు జుత్తు విరబోసుకొని తిరుగుతుండగా, వారిలో క్రమశిక్షణ అలవర్చేందుకు కొందరి జుత్తును కొద్దిగా కత్తిరించామని తెలిపారు. దీనిపై ఎంఈఓ బాబూరావు పడాల్‌ను వివరణ కోరగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories