SP Malika Garg: శాంతిభద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు.. ఇక్కడ జైలు నిండిపోతే.. రాజమండ్రికి పంపిస్తున్నాం

SP Mallika Garg Warning to Political Leaders
x

SP Malika Garg: శాంతిభద్రతలపై రాజీపడే ప్రసక్తే లేదు.. ఇక్కడ జైలు నిండిపోతే.. రాజమండ్రికి పంపిస్తున్నాం

Highlights

ఫలితాలు వెలువడే రోజు అల్లర్లు సృష్టిస్తే.. కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్

SP Malika Garg: అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ వార్నింగ్ ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఎస్పీ మల్లికాగార్గ్ మాట్లాడారు. కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ కార్గ్ చెప్పారు.

పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా చెడు ఘటనలతో ప్రచారంలోకి రావడం బాధాకరమని ఎస్పీ మల్లికాగార్గ్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాను కూడా పల్నాడు జిల్లా వాసినే ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే తన లక్ష్యం అంటూ ఎస్పీ మల్లికాగార్గ్ స్పష్టం చేశారు.

పోలింగ్ రోజు.. ఆ తర్వాత రోజు జరిగిన అల్లర్లలో మొత్తం 160 కేసులు నమోదు కాగా.. 1200 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇక్కడ నరసరావుపేటలో జైలు సరిపోక.. రాజమండ్రి జైలుకు పంపించినట్టు తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యే ఎవరు రోడ్లపై తిరగొద్దని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories