TTD: టీటీడీ భక్తులకు శుభవార్త..తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్

TTD: టీటీడీ భక్తులకు శుభవార్త..తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్
x

TTD: టీటీడీ భక్తులకు శుభవార్త..తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్

Highlights

TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని పరిగణలోనికి తీసుకుని తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లను పునరుద్దరించింది. పూర్తి వివరాలను తెలుసుకుందాం.

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే ప్రయాణికులను గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల రద్దీని ద్రుష్టిలో ఉంచుకుని తిరుపతికి మరిన్ని రైళ్లను ప్రకటించింది. రైలు నెంబర్ 07482 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం అందుబాటులో ఉండనుంది. ఈ రైలు 2024 జులై 8 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07481 తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉండనుంది. ఈ రైలును 2024 జులై 7 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించింది.

07605 రైలు తిరుపతి నుంచి అకోలా వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలును 2024 జులై 5 నుంచి సెప్టెంబర్ 27 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07606 అకోలా నుంచి తిరుపతి వరకుప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. జులై 7 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించింది. 07609 పూర్ణ నుంచి తిరుపతి వరకు ప్రతీ సోమవారం ఉండనున్న ఈ రైలు..2024 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. 07610 నెంబర్ రైలు తిరుపతి నుంచి పూర్ణ వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది.2024 జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించింది.

07631 హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వరకు ప్రతీ శనివారం అందుబాటులో ఉండనున్న ఈ రైలును 2024 జూలై 6 నుంచి సెప్టెంబర్ 28 వరకు పొడిగించింది రైలు నెంబర్ 07632 నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉండగా... ఈ రైలును 2024 జూలై 7 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించింది . 07445 కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు ప్రతీ సోమవారం, బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉండనున్న ఈ రైలును 2024 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07446 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వరకు ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉండనున్న ఈ రైలును 2024 జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories