Nellore: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. ఒకే రోజు ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..?

Six Dead in Nellore Government Hospital
x

Nellore: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. ఒకే రోజు ఆరుగురు మృతి.. ఏం జరిగిందంటే..?

Highlights

Nellore: నెల్లూరు జిల్లా జీజీహెచ్ ఆస్పత్రిలో ఒకేరోజు ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది.

Nellore: నెల్లూరు జిల్లా జీజీహెచ్ ఆస్పత్రిలో ఒకేరోజు ఆరుగురు మృతి చెందడం కలకలం రేపింది. MICU వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు శుక్రవారం మృత్యువాత పడ్డారు. ఐసీయూలో ఆక్సిజన్ అందకే పేషంట్లు చనిపోయారని.... వారందరినీ ఒకే వాహనంలో మహా ప్రస్థానం పంపారంటూ ఆరోపణలు వస్తున్నాయి.

ఇక ఆరుగురు మృతిపై వస్తున్న ఆరోపణలను ఖండించారు సూపరింటెండెంట్ సిద్దా నాయక్. చనిపోయిన వారంతా వివిధ సమయాల్లో చనిపోయారని.. తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించారని చెబుతున్నారు. ఆక్సిజన్‌ లేదన్న వార్తలు అవాస్తవమన్నారు సూపరింటెండెంట్. హాస్పిటల్‌లో ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చనిపోయిన వారంతా వేరు వేరు ప్రాంతాల వారైనప్పుడు.. అందరినీ ఒకే వాహనంలో పంపడం అసాధ్యమని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories