East Godavari: భాషలెన్నైనా నేర్చుకో... తెలుగు భాషను అక్కున చేర్చుకో' అనే నినాదంతో చిత్రీకరణ

Sisters Created Saikata Sculpture on the occasion of Telugu Language Day
x

East Godavari: భాషలెన్నైనా నేర్చుకో... తెలుగు భాషను అక్కున చేర్చుకో' అనే నినాదంతో చిత్రీకరణ

Highlights

East Godavari: తెలుగు భాషా గొప్పదనాన్ని అందరికీ గుర్తుచేసేలా సైకత శిల్పం తయారీ

East Godavari: దేశ భాషలందు తెలుగు లెస్స.. చరిత్రలో తెలుగు భాష అభివృద్ధి చేసిన మహానీయులు కొందరున్నారు. వారిలో గిడుగు వెంకటరామమూర్తి పంతులు ఎంతగానో కృషి చేశారు. ఆయన పుట్టినరోజునే తెలుగు భాషా దినోత్సంగా నిర్వహిస్తారు.

తెలుగు భాష గొప్పదనాన్ని అందరికీ గుర్తు చేసేలా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు సోహిత, ధన్యతలు సైకత శిల్పాన్ని రూపొందించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని అద్బుతమైన శిల్పాన్ని ఆవిష్కరించారు. భాషలెన్నైనా నేర్చుకో... తెలుగు భాషను అక్కున చేర్చుకో' అనే నినాదంతో చిత్రీకరించారు. సైకత చిత్రంలో గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రాన్ని పొందుపరిచారు. ప్రస్తుతం తెలుగు భాష దైన్యాన్ని గుర్తు చేసేలా 'అ' అక్షరం రోదిస్తున్నట్టు తీర్చిదిద్దారు. మరో వైపు హెచ్‌ఎంటీవీ లోగోనూ సైతం చిత్రీకరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వార్తలను సుస్పష్టంగా తెలియజేస్తున్న హెచ్‌ఎంటీవీపై అభిమానంతో లోగోను చిత్రీకరించామన్నారు.

ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోను తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008 లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories