Simhachalam: అప్పన్న చందనోత్సవం.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

Simhachalam Temple Chandanotsavam
x

Simhachalam: అప్పన్న చందనోత్సవం.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

Highlights

Simhachalam: తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన దర్శనాలు

Simhachalam: ఏడాది మొత్తం చందనం పూతలో వుండే సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఇవాళ భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. చందనోత్సవంగా పేర్కొనే ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వరాహ-నారసింహ అవతారాల సమ్మేళనంగా అలరారుతున్న సింహాద్రినాథుడి నిజరూపాన్ని కనులారా వీక్షించడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం, టీటీడీ తరపున వైవీ సుబ్బారెడ్డి, మంత్రి సత్యనారాయణ పట్టువస్త్రాలు సమర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories