Sidiri Appalaraju Taken Charge: బాధ్యతలు చేపట్టిన మంత్రి సీదిరి అప్పలరాజు.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..

Sidiri Appalaraju Taken Charge: బాధ్యతలు చేపట్టిన మంత్రి సీదిరి అప్పలరాజు.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..
x
Highlights

sidiri appalaraju taken charge: సచివాలయం 4వ బ్లాక్ లో రాష్ట్ర పశుసంవర్దక , మత్స్య , పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి...

sidiri appalaraju taken charge: సచివాలయం 4వ బ్లాక్ లో రాష్ట్ర పశుసంవర్దక , మత్స్య , పాడి పరిశ్రమాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి సిదిరి అప్పలరాజు. వేదపండితుల మద్య కుటుంబ సబ్యులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు మంత్రి అప్పలరాజు. ఆక్వా అధారిటి యాక్ట్ బిల్లుపై తొలి సంతకం చేశారు మంత్రి అప్పలరాజు. అనంతరం మంత్రి మీడియా తో మాట్లాడుతూ.. ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో 700 కోట్లు కేటాయించామని చెప్పారు.

మత్స్య కారుడినైన నాకు ఈ శాఖ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మత్స్యకారులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మత్స్యకారుల వలసలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము. ఆక్వారంగానికి కరెంటు యూనిట్ రూపాయున్నరకే ఇస్తున్నాము. పాలసేకరణ ధర పెంచుతున్నాము అందులో భాగమే అమూల్ తో mou. పేదప్రజల జీవనప్రమాణాలు పెరగాలని ముఖ్యమంత్రి అహార్నిశలు పనిచేస్తున్నారు. నాకిచ్చిన ఈ భాద్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను, మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నమ్మకాన్ని నిలబెడతానని మంత్రి సీదిరి అప్పలరాజు తులిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories