Bapulapadu: గొలుసు చోరీ కేసులో 24 గంటల్లో నిందితుల అరెస్ట్

Bapulapadu: గొలుసు చోరీ కేసులో 24 గంటల్లో నిందితుల అరెస్ట్
x
S.I Chanti Babu caught by the accused within 24 hours of chain snatching
Highlights

మండలంలో అరవపల్లి.శేషా రత్నం(65)ను తెలిసిన వ్యక్తిలా హాస్పిటల్ కి వెళ్తున్నారా నేను దింపుతాను అని పోలవరం కాలువ వద్దకు తీసుకెళ్లి ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసు లాక్కొని పరారయ్యాడు.

బాపులపాడు: మండలంలో అరవపల్లి.శేషా రత్నం(65)ను తెలిసిన వ్యక్తిలా హాస్పిటల్ కి వెళ్తున్నారా నేను దింపుతాను అని పోలవరం కాలువ వద్దకు తీసుకెళ్లి ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసు లాక్కొని పరారయ్యాడు. ఆమె వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన ఎస్ఐ సీతారాంపురం నేషనల్ హైవే వద్ద పట్టుకొని పినిమాల.జయరాజు అలియాస్ ఏసు అలియాస్ యేసు రాజు(32) ను అరెస్ట్ చేశారు. ముద్దాయి నీ విచారించగా హనుమాన్ జంక్షన్ లోని ఏలూరు రోడ్ లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో తాకట్టు పెట్టి రూ. 65,500 నగదు తీసుకొని ఆ డబ్బులు తో పేకాట అడి, మద్యం సేవించి, కొంత నగదు వాడుకున్నట్లు తెలిపాడు.

అతని వద్ద 40 వేల నూట యాభై రూపాయలు నగదును స్వాధీనం చేసుకుని నేరానికి ఉపయోగించిన స్కూటీ స్వాధీనపరచుకొని, అనంతరం గొలుసు రికవరీ చేసి ముద్దాయి నీ నూజివీడు జడ్జి వద్ద హాజరుపరచగా ముద్దాయి 14 రోజులు రిమాండ్ విధించి నట్లు ఎస్సై తెలిపారు. చైన్ స్నాచింగ్ జరిగిన 24 గంటల్లోనే ముద్దాయి ని పట్టుకున్న వీరవల్లి ఎస్సై యన్.చంటి బాబు ని, సిబ్బందిని,ఉన్నతాధికారులు అయినా హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నూజివీడు డిఎస్పీ కృష్ణా జిల్లా ఎస్పీ అభినందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories