సీఎం జగన్‌ను కలిసిన స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌

Shuttler Kidambi Srikanth Meets CM YS Jagan In Amravati
x

సీఎం జగన్‌ను కలిసిన స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌

Highlights

kidambi Srikanth: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.

kidambi Srikanth: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు కిదాంబి శ్రీకాంత్. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో కిదాంబి శ్రీకాంత్ రజత పతకం సాధించారు.

శ్రీకాంత్‌ను సీఎం జగన్ సన్మానించారు. ప్రభుత్వం తరఫున 7 లక్షల రూపాయల నగదు, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. బుధవారం జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శాప్‌ ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories