TDP: టీడీపీలో సెప్టెంబర్ సంక్షోభం..?

September Crisis In TDP
x

TDP: టీడీపీలో సెప్టెంబర్ సంక్షోభం..?

Highlights

TDP: జైలు నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందో తెలియక టెన్షన్

TDP: ఆగస్టు.. ఆ నెల పేరు చెప్తేనే టీడీపీకి పెద్ద గ్రహపాటు నెలగా చెబుతుంటారు ఆ పార్టీ నేతలు. తెలుగుదేశానికి ఇబ్బంది తెచ్చిపెట్టిన ఘటనలన్నీ ఆ నెలలోనే జరుగుతూ ఉండడంతో పార్టీ దృష్టిలో ఆగస్టుకు ఆ ముద్ర పడిపోయింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ నెల కూడా సంక్షోభంగా మారిందనే టాక్ మొదలైంది. తెలుగు తమ్ముళ్లలోనూ ఇప్పుడు అదే టెన్షన్‌ పట్టుకుందనే ప్రచారాలు జరుగుతున్నాయి.

గతంలో ఆగస్టు వచ్చిందంటే టీడీపీలో.. తెలుగు తమ్ముళ్లలో ఏం జరుగుతుందో తెలియని టెన్షన్. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఉన్న టైమ్‌లోనే కీలకమైన మూడు ఆగస్టు సంక్షోభాలను ఆ పార్టీ ఫేస్ చేసింది. ఇందులో రెండింటినీ ఎన్టీఆర్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో ఇప్పటికీ ఉంది. ఆగష్టు నెల అంటేనే తెలుగు దేశం పార్టీకి సమస్యల కార్నర్‌గా ఉంటుందనే పేరుంది. నాదెండ్ల భాస్కర్‌రావు ఎపిసోడ్‌ మొదలు.. ఆ పార్టీ ఆగస్టు నెలలోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని చెబుతారు. రేణుకా చౌదరి ఆగస్టులో గొడవకు దిగడం, చంద్రబాబు పార్టీని చేజిక్కించుకోవడం కూడా ఆగస్టులోనే జరిగినట్లు చెప్తారు. దీంతో ఆగస్టు సంక్షోభం అనే ముద్ర ఆ పార్టీపై పడింది.

ఇక సెప్టెంబర్‌ నెలలోనూ తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనంతగా సంక్షోభంలో ఉందా..? ఆగస్టు కష్టాలన్నీ సెప్టెంబర్‌కు షిఫ్ట్ అయ్యాయా..? అనే చర్చ పొలిటికల్ వర్గా్ల్లో జరుగుతోంది. నాయకత్వం విషయంలో టీడీపీ ఇబ్బందులు పడుతోందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో ఆ పార్టీని సంక్షోభం చుట్టుముట్టిందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. అధినేత అరెస్టుతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ నెలకొంది. జైలు నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందో తెలియక ఆందోళనలో ఉన్నారు. దీంతో పార్టీని లీడ్ చేసేదెవరు అన్నది క్వశ్చన్‌గా మారిపోయింది.

మరోవైపు చంద్రబాబు జైలు ఎపిసోడ్ కొనసాగుతుండగానే ఆయన కుమారుడు నారా లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో నారా లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ టూర్‌లో ఉన్న లోకేష్‌.. ఏపీకి వచ్చిన మరుక్షణమే సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో టీడీపీ కార్యకర్తల్లో మరింత టెన్షన్ కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories