Y S Viveka Murder Case: ఏపీ ఎన్నికల వేళ కడప కోర్టు సంచలన నిర్ణయం

Sensational Decision Of Kadapa Court During AP Elections
x

Y S Viveka Murder Case: ఏపీ ఎన్నికల వేళ కడప కోర్టు సంచలన నిర్ణయం  

Highlights

Y S Viveka Murder Case: వివేకా హత్య కేసు గురించి ఎక్కడా ప్రస్తావించకూడదని ఆదేశం

Y S Viveka Murder Case: ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకా హత్య కేసు సంచలనంగా మారింది. కొద్దిరోజులుగా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అధికారిక వైసీపీ నాయకులపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్‌ వివేకా హత్యకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డినే కారణమని ఆయన సోదరులు వైఎస్‌ షర్మిల, సునీత ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకా హత్య గురించి మాట్లాడకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేశ్‌ బాబు కడప జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫున నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య ప్రస్తావన తీసుకురావద్దని వైఎస్‌ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, పురంధేశ్వరి, నారా లోకేశ్‌ను ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories