Macherla: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. సచివాలయ ఉద్యోగి సస్పెండ్

AP Minister Achchennaidus sensational comments on NTR Bharosa scheme
x

Pensions: వచ్చే నెల నుంచి 2లక్షల మందికి పింఛన్లు కట్

Highlights

Macherla: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. సచివాలయ ఉద్యోగి సస్పెండ్

Pension Distribution: బతుకు భారమైన వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తుంటే.. అలాంటి పెన్షన్లనూ మింగేసి కడుపుకొట్టాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా.. పెంచిన పింఛన్లు అందిస్తుండగా.. ఓ మాచర్ల 9వ వార్డుకు చెందిన సచివాలయ ఉద్యోగి అందులో 5 వందలు మింగేశాడు. 7వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిన దగ్గర 6 వేల 5 వందల ఇస్తూ మోసం చేశాడు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేతివాటం ప్రదర్శించిన బాలునాయక్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మాచర్ల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మాచర్ల మున్సిపల్ కమిషనర్ సీరియస్‌గా స్పందించారు.. డబ్బులు వసూలు చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు. పింఛన్‌లు పంపిణీ చేసి కమీషన్ తీసుకున్నందుకు వాలు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఎవరైనా పింఛన్ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని.. కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories