Viveka Murder Case: వివేకా హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు సీబీఐ కోర్టుకు వెల్లడి

Secret Witness Details to CBI Court in Vivek Murder Case
x

Viveka Murder Case: వివేకా హత్య కేసులో రహస్య సాక్షి వివరాలు సీబీఐ కోర్టుకు వెల్లడి

Highlights

Viveka Murder Case: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సందర్భంగా రహస్య సాక్షి ప్రస్తావన

Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రహస్య సాక్షికి సంబంధించి గతంలో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ సందర్భంగా సీబీఐ ప్రస్తావించింది. ఆ రహస్య సాక్షిగా పులివెందుల వైసీపీ నేత కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని తెలంగాణ హై కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఏప్రిల్‌ 26న హైదరాబాద్‌లో శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ జూన్‌ 30న కోర్టుకు సమర్పించింది.

2018 అక్టోబరు 1న వివేకానందరెడ్డి మా ఇంటికొచ్చారని...వైసీపీని వీడొద్దని కొరారని శివచంద్రారెడ్డి తెలిపారు. అవినాష్‌, శివశంకర్‌రెడ్డిలతో పనిచేయలేనని చెప్పానని...అవినాష్‌కు జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వనున్నట్లు వివేకా చెప్పారన్నారు. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీ చేస్తారని...దీనిపై జగన్‌మోహన్‌రెడ్డితో కూడా మాట్లాడాడని...వివేకా తనతో చెప్పినట్లు శివచంద్రారెడ్డి సీబీఐ కోర్టుకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories