Schools Re Opens in Andhra Pradesh: ఏపీలో స్కూల్స్ ఎప్పటి నుంచో తెలుసా?

Schools Re Opens in Andhra Pradesh: ఏపీలో స్కూల్స్ ఎప్పటి నుంచో తెలుసా?
x
Highlights

Schools Re Opens in Andhra Pradesh: సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికే నెల రోజుల తరగతులు పూర్తికావాల్సి ఉంది.

Schools Re Opens in Andhra Pradesh: సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికే నెల రోజుల తరగతులు పూర్తికావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి వల్ల అంతా తలకిందులయ్యింది. అయితే దీనికి అడ్డుకట్ట వేయడం ఇప్పట్లో జరిగే పని కాదని భావించిన ఏపీ ప్రభుత్వం కొన్ని సూచనలు చేస్తూ వీలైనంత వరకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే దీర్ఘకాలిక రోగాలు, కంటోన్మెంట్ లో ఉన్న ఉపాధ్యాయులకు కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని చెబుతోంది.

ఏపీ విద్యాశాఖ పాఠశాలల నిర్వహణలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ పలు మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టనుంది. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనిదినాలు కుదించిన విద్యాశాఖ పాఠశాల నిర్వహణపై అధికారులకు దిశానిర్ధేశం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు వివరాలు వెల్లడించారు.#

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా..ఈ నెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికి ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండ్రోజులు పనిచేసేలా పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బ్రిడ్జి కోర్సుల ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టచ్ లో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా విద్యాశాఖ పేర్కొంది. జులై 10వ తేదీలోపు హెడ్ మాస్టార్లు, టీచర్లు యుడైస్ ఫ్లస్ డేటాను రిజిస్టర్ లో అప్ డేట్ చేయాల్సిందిగా సూచించారు. నాడు-నేడు మొదటి ఫేజ్ లో పాల్గొంటున్నహెడ్ మాస్టార్లు, టీచర్లు కంటిన్యూగా స్కూల్స్ కు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

హెడ్మాస్టర్లు ఉప్యాధాయులకు నాడు-నేడులో జరిగే 9 పనులను టీచర్లకు పంపిణీ చేయాల్సిందిగా విద్యాశాఖ నిర్ణయించింది. జులై 31వ తేదీలోగా ఈ పనులన్నీ పూర్తయ్యేలా టీచర్లు మానిటరింగ్ చేసే బాధ్యత తీసుకోవాలి. నాడు-నేడు పనుల నుంచి కంటైన్మెంట్ జోన్లలో ఉన్న, దీర్ఘకాలిక వ్యాధులు, కంటిచూపు లో లోపాలు , దివ్యాంగులైన ఉపాధ్యాయులకు మినహాయింపు ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.

విద్యా సంవత్సరం ప్రణాళిక ఆధారంగా బ్రిడ్జి కోర్సులు, హైటెక్, నోటెక్, వ్యూహాలను పాఠశాలలు ఓపెన్ అయ్యేలోగా సిద్ధం చేయాలని సూచించారు. ప్రతివారం ఈ బ్రిడ్జి కోర్సు ద్వారా ఇచ్చిన మెటీరియల్ ను విద్యార్థులు ఫాలో అవుతున్నారో లేదో ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని చెప్పారు. ప్రాథమికోన్నత పాఠశాల హైస్కూల్స్ కు సంబంధించి బ్రిడ్జి కోర్సు మెటీరియల్ ను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో సిద్ధం చేయాలని వీలైనంత తొందరగా వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.

కంప్యూటర్, నెట్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు వారి ఫార్మామెన్స్ మానిటరింగ్ చేయాలి. ప్రతి ఉపాధ్యాయుడు 10 నుంచి 20 మంది విద్యార్థులను తీసుకొని వాళ్లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తగిని గైడ్‌లెన్స్ ఇస్తూ ఉండాలన్నారు. ఈ పనిని హెడ్‌మాస్టార్, ఆయా ఉపాధ్యాయులకు కేటాయించాలంటూ విద్యాశాఖ కమిషనర్ ఒక సర్క్యూలర్ జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories