Schools Re-open in AP: అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం?..అన్ లాక్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం

Schools Re-open in AP: అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం?..అన్ లాక్  నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం
x
Highlights

Schools Re-open in AP | కరోనా మహమ్మారి పుణ్యమాని చదువులకు దాదాపుగా ఫుల్ స్ఠాప్ పడినట్టే కనిపిస్తోంది.

Schools Re-open in AP | కరోనా మహమ్మారి పుణ్యమాని చదువులకు దాదాపుగా ఫుల్ స్ఠాప్ పడినట్టే కనిపిస్తోంది. అక్కడక్కడా హైయర్ స్టాండర్డ్స్ కు సంబంధించి ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నా, పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతున్నట్టు కనిపించలేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం వచ్చే నెల 5 నుంచి పాఠశాలలను తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే కోవిద్ కు సంబంధించి అన్ లాక్ 05 నిబందనలు వచ్చిన తరువాత అవసరమైతే మార్పులు చేసేందుకు నిర్ణయించింది.

కోవిడ్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయితే ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్‌లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు. కరోనా అనంతరం కాలేజీలు, యునివర్సిటీల్లో అనేక మార్పులు చోటుచేసునున్నాయని తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు అంచనా వేసి అనేక మార్గదర్శకాలు సిద్దం చేశామని పేర్కొన్నారు.

మంగళగిరిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి సురేష్‌ పలు అంశాలను ప్రస్తావించారు. 'ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి మూడు రాజధానులు ఉంటాయి అని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఇది అభివృద్ది వికేంద్రీకరణ మాత్రమే. లక్ష కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. పథకాలకు పేరు మారుస్తున్నాం అని ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో గతంలో ఇచ్చిన మెనుకు ఇప్పటి మెనుకు తేడా గమనించాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ కు ఆద్యుడు. రైతులకు ఉచిత కరెంట్‌ పథకంపై చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం సరైనది కాదు' అని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories