Corona: కరోనాకు హాట్‌ స్పాట్స్‌గా విద్యాసంస్థలు

Schools are Hot spot To Coronavirus
x

పాఠశాల (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు బంద్, పరీక్షలు రద్దు

Corona: దేశాన్ని కరోనా కలవరపెడుతోంది. భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. బతికితే చాలురా నాయనా అనే పరిస్థితులు దాపరించాయి. అందుకే రాష్ట్రాలు విద్యాసంస్థలకు తాళాలు వేస్తున్నాయి. పిల్లల చదువులకంటే ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వాలు నిర్ణయానికి వస్తున్నాయి. పరీక్షా ఏదైనా.. క్లాసులు ఏవైనా రద్దు చేస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం బడి గంటలు మోగుతూనే ఉన్నాయి. పిల్లలు భయపడుతూనే బాడిబాట పడుతున్నారు. ఎలక్షన్స్‌ వద్దే వద్దంటూ కోర్టుల చుట్టూ తిరిగిన ప్రభుత్వం... విద్యాసంస్థలను ఎందుకు బంద్‌ చేయడం లేదు. పరీక్షల నిర్వహణపై క్లారిటీకి రాకపోవడానికి కారణం ఏంటి.

దేశంలో కరోనా విషం చిమ్ముతోంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ ఏం మినహాయింపు కాదు. ఇక్కడ కూడా కరోనా కేసులు జెట్‌ స్పీడ్‌ దూసుకువస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 20 మంది ప్రాణాలను కోల్పోయారు. గడపదాటాలంటేనే జనానికి దడపుడుతోంది. పాఠశాలల్లోనూ టీచర్లు, విద్యార్థులు అన్న తేడా లేకుండా అందర్ని టచ్ చేస్తోంది. ఇలాంటి సమయంలో తమ పిల్లలను బడికి పంపించాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు.

దేశంలో కరోనా ఉధృతికి కేంద్రం కూడా సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. అంతకుముందే మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కూడా విద్యాసంస్థలకు తాళాలు పడ్డాయి. ఇటు పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులను ప్రమోట్ చేశారు. సెంకడ్‌ ఇయర్‌ పరీక్షలను వాయిదా వేశారు. ఇవేమీ పట్టించుకోని ఏపీ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎలెక్షన్స్, మున్సిపల్ ఎలెక్షన్స్ వద్దంటూ కోర్టుల చుట్టూ తిరిగింది. కానీ ఇప్పుడు కరోనా విజృభిస్తుంటే.. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను మాత్రం దర్జాగా రన్‌ చేపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న స్కూళ్లలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కానీ పిల్లల భవిష్యత్, భద్రత బాధ్యత తమేదే అంటూ ప్రభుత్వం చెబుతోంది.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అప్పటి వరకు షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా జరుగుతుందని జగన్ సర్కార్ అంటోంది. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నామని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories