ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదల

Schedule Release for Six MLC Positions in Andhra Pradesh
x

Representational Image

Highlights

* ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్ల స్వీకరణ * మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ * మార్చి 5 నామినేషన్ల పరిశీలన

AP Elections: ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలు చేసేందుకు మార్చి 4 తుదిగడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 8వరకూ గడువునిచ్చింది ఈసీ. మార్చి 15న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది.

ఏపీలో మార్చి 29న నలుగురు ఎమ్మెల్సీలు రిటైర్‌ కానున్నారు. తిప్పేస్వామి, వెంకన్న చౌదరి, సంధ్యారాణి ,మహమ్మద్ ఇక్బాల్ రిటైర్‌ కానున్నారు. వీటితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ రాజీనామా చేయగా ఏర్పడిన స్థానానికి చల్లా రామకృష్ణా రెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి కూడా మార్చి 15న ఉప ఎన్నిక జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories