Koneti Adimulam's Wife: మహిళపై లైంగిక వేధింపులు.. స్పందించిన కోనేటి ఆదిమూలం భార్య

Koneti Adimulams Wife: మహిళపై లైంగిక వేధింపులు.. స్పందించిన కోనేటి ఆదిమూలం భార్య
x
Highlights

Koneti Adimulam's Wife Reaction: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు అని ఓ మహిళ చేసిన ఆరోపణలు పెను సంచలనం...

Koneti Adimulam's Wife Reaction: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు అని ఓ మహిళ చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. తనపై లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నాయని చెబుతూ అందుకు ఆధారంగా ఆ మహిళ వీడియోలు కూడా విడుదల చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కోనేటి ఆదిమూలంపై ఆగ్రహం వ్యక్తంచేసిన తెలుగు దేశం పార్టీ.. ఆ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

తాజాగా తన భర్తపై వస్తోన్న ఆరోపణలపై కోనేటి ఆదిమూలం భార్య స్పందించారు. ఒక టీవీ ఛానెల్‌తో కోనేటి ఆదిమూలం భార్య మాట్లాడుతూ.. తన భర్తపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఇది రాజకీయంగా ఎవరో పడని వాళ్లు చేసిన కుట్రగా ఆదిమూలం భార్య అభివర్ణించారు. తన భర్త చాలా మంచివాడని.. పెళ్లయిన ఇన్నేళ్లలో ఎప్పుడూ ఆయన ఎవ్వరితోనూ తప్పుగా ప్రవర్తించలేదన్నారు. తనని, తన పిల్లలను కూడా ఆయన బాగా చూసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం తమ గ్రామంలో ఎవ్వరిని అడిగినా చెబుతారని ఆమె తన భర్త ఆదిమూలం గురించి చెప్పుకొచ్చారు.

తమ తండ్రి కోనేటి ఆదిమూలంపై వస్తోన్న లైంగిక దాడి ఆరోపణలపై ఆయన ఇద్దరు కూతుళ్లు కూడా స్పందించారు. తమ తండ్రి అలాంటి వాడు కాదని.. అవి నిరాధారమైన ఆరోపణలేనని వాళ్లు చెబుతున్నారు. అంతేకాకుండా.. తమ తండ్రిపై ఆరోపణలు చేసిన మహిళకు పని ఇవ్వలేదనే అక్కసుతోనే ఈ ఆరోపణలకు పాల్పడుతోందన్నారు. ఎన్నికలకు ముందు తమ తండ్రికి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని ఆ మహిళ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ టీడీపీ టికెట్ ఇవ్వడమే కాకుండా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి చూపించారు. దీంతో తమ తండ్రి గెలుపుని జీర్ణించుకోలేకనే ఆ మహిళ ఈ రకమైన కుట్రకు తెరతీసిందని కోనేటి ఆదిమూలం కూతుళ్లు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories