Sankranti Special Buses: సంక్రాంతి పండక్కి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్ ..ఏపీకి స్పెషల్ బస్సులు

Sankranti Special Buses: సంక్రాంతి పండక్కి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్ ..ఏపీకి స్పెషల్ బస్సులు
x
Highlights

Sankranti Special Buses: సంక్రాంతి పండక్కి ఊరు వెళ్తున్నారా? అయితే మీకు అదిరిపోయే న్యూస్. హైదరాబాదులో రద్దీగా ఉండే ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్,...

Sankranti Special Buses: సంక్రాంతి పండక్కి ఊరు వెళ్తున్నారా? అయితే మీకు అదిరిపోయే న్యూస్. హైదరాబాదులో రద్దీగా ఉండే ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కెపిహెచ్బి ,బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా అధికారులను నియమించింది.

సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అందులో 550 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. గత సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 5246 బస్సులను సంస్థ నడిపింది. గత సంక్రాంతి అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈసారి 6432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది టిజీఎస్ఆర్టీసీ. జనవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టిజీఎస్ఆర్టిసి అధికారులు వెల్లడించారు.

హైదరాబాదులోని రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్,ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కెపిహెచ్బి, బోయిన్పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల నుంచి ఈ స్పెషల్ బస్సులను నడుపుతుంది సంస్థ. ఆయా ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా అధికారుల నియమించింది టీజీఎస్ ఆర్టీసీ.

మరోవైపు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులను నడుపుతుంది టీజీఎస్ ఆర్టీసీ. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నరసాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం ,ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తిరుపతి, శ్రీశైలం వంటి ప్రాంతాలకు ఈ బస్సులను నడుపుతాయి. అలాగే తెలంగాణతో పాటు ఏపీ నుంచి తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం కూడా ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది.

ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించింది. సంక్రాంతి ఆపరేషన్స్ ఆర్టీసీకి ఎంతో కీలకమని ఆ మేరకు పూర్తిగా సన్నద్ధం కావాలని క్షేత్ర క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. హైదరాబాదులోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండిల్స్, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు టీజేఎస్ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది,

ఇక రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ సదుపాయం అమల్లో ఉంటుందని తెలియజేసింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని వివరించింది. ప్రైవేట్ వెహికల్స్ లో ప్రమాదకర ప్రయాణం చేయకూడదని ప్రజలకు సూచించింది. సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లేవారు టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories