Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. మళ్లీ వరుస సెలవులు

Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. మళ్లీ వరుస సెలవులు
x
Highlights

Sankranti Holidays: సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ కాలేజీలకు, స్కూళ్ల కు ప్రత్యేక సెలవులను ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్...

Sankranti Holidays: సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ కాలేజీలకు, స్కూళ్ల కు ప్రత్యేక సెలవులను ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ కాలేజీలకు జనవరి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 6 రోజులు పాటు సెలవులు ఉంటాయి. పాఠశాలల విషయంలో జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు7 రోజుల పాటు సెలవులను ప్రకటించింది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పండగ సంబురాలను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం పొందుతారు. సంక్రాంతి పండగ దక్షిణ భారతదేశంలో ప్రత్యేకమైన పండగ.

అటు ఏపీలో సంక్రాంతి సెలవులు మరిన్ని పెంచారు. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు సెలవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ సెలవులు ముఖ్యంగా పల్లెటూరులో, రైతుల పండగకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఆచారసంప్రదాయాలకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థఉలకు పాఠశాల నుంచి తీసుకున్న ఈ విరామం, వారు సమాజ, సంస్క్రుతితో మమేకమవడానికి మంచి ఛాన్స్ అందిస్తుంది.

ఈ సెలవుల ప్రకటనతో విద్యార్థుల కుటుంబాలు మందుస్తు ప్రణాళికలు వేసుకునే విధంగా చేస్తుంది. ఇక తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పండగ వేడుకలు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. సంక్రాంతి ఆనందం ప్రతి ఒక్కరి మనస్సుల్లో నిండిపోతుంది. ఈ సారి భోగికి ముందు రెండో శనివారం, ఆదివారం కావడంతో సంక్రాంతి సెలవులు మరో రెండు రోజుల పాటు పెరిగాయి. ప్రతి ఏడాది మూడు రోజులు ప్రకటించే సర్కార్ ఈ ఏడాది 6 రోజులు ఇవ్వడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories