TDP Office Attack Case: నేడు పోలీసుల విచారణకు సజ్జల..

Sajjala Ramakrishna Reddy To Attend Police Interrogation
x

TDP Office Case: నేడు పోలీసుల విచారణకు సజ్జల..

Highlights

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Sajjala Ramakrishna Reddy: వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఈరోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సాయంత్రం 4 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు సజ్జల రానున్నారు. దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించే క్రమంలో సజ్జలకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు మరికొందరు వైసీపీ నేతలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఘటన వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లను పలుమార్లు విచారించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories