ఎస్వీబీసీ ఛైర్మన్ గా క్రిష్ణ యాచేంద్ర బాధ్యతలు !

ఎస్వీబీసీ  ఛైర్మన్ గా  క్రిష్ణ యాచేంద్ర బాధ్యతలు !
x
Highlights

టీటీడీ ఎస్వీబిసి ఛైర్మన్ గా డాక్టర్ వీబీ సాయిక్రిష్ణ యాచేంద్ర బాధ్యతలు స్వీకరించారు. సినీ నటుడు పృథ్వీ రాజ్ తరువాత ఆ పదవి ఖాళీగా ఉండడంతో ఆ పదవిలో ప్రభుత్వం యాచేంద్రను ఛైర్మన్ గా నియమించింది.

టీటీడీ ఎస్వీబిసి ఛైర్మన్ గా డాక్టర్ వీబీ సాయిక్రిష్ణ యాచేంద్ర బాధ్యతలు స్వీకరించారు. సినీ నటుడు పృథ్వీ రాజ్ తరువాత ఆ పదవి ఖాళీగా ఉండడంతో ఆ పదవిలో ప్రభుత్వం యాచేంద్రను ఛైర్మన్ గా నియమించింది. ఆయన నేడు బాధ్యతలు స్వీకరించారు. ఛానెల్ ఎండీ, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఇతర అధికారలు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... శ్రీవారి ప్రాభవాన్ని దశదిశలా వ్యాపించడం కోసం వ్యవస్థీకృతమైన సంస్థలో శక్తి వంచనలేకుండా పనిచేస్తానని అన్పారు... ఇక నూతన ఛైర్మన్ గా స్వామివారు కల్పించిన అవకాశంగా భావిస్తున్నట్టుగా అయన తెలిపారు..

ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో నాకీ అవకాశం దక్కిందని, ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుస్తానని ఎస్వీబిసి ఛైర్మన్ యాచేంద్ర తెలిపారు.. రెండేళ్ల పాటు యాచేంద్ర ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎస్వీబీసీ ఛానెల్‌ నిర్వహణ టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అటు ప్రముఖ సంగీత కళాకారుడైన యాచేంద్ర 1985 నుంచి 1989 వరకు వేంకటగిరి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరవాత అయన వైసీపీలో చేరారు.. ఇక ఇది ఇలా ఉంటే తనపై లైంగిక ఆరోపణలు రావడంతో గతంలో చైర్మెన్ పదవికి పృథ్వి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories