ఏపీ ఇంటర్ విద్యామండలిలో నిధుల గోల్‌మాల్.. రూ. 50 లక్షలు...

Rs 50 Lakhs Funds Golmal in Board of Intermediate Education AP | Live News
x

ఏపీ ఇంటర్ విద్యామండలిలో నిధుల గోల్‌మాల్.. రూ. 50 లక్షలు...

Highlights

Board of Intermediate Education: పారితోషికాలు రావడంతో కొన్ని నెలలుగా బోర్డుకు లెక్చరర్లు, సిబ్బంది ఫిర్యాదు...

Board of Intermediate Education: ఏపీ ఇంటర్ విద్యామండలిలో నిధుల గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. 50 లక్షల రూపాయల నిధులు గోల్‌మాల్‌ జరిగినట్లు గుర్తించినట్లు సమాచారం. సిబ్బందికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఓ ఉద్యోగి తన ప్రైవేట్‌ ఖాతాకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

అయితే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఉద్యోగిపై కేసు నమోదు చేసేందుకు బోర్డు సిద్ధమవుతోంది. పారితోషికాలు రావడంతో కొన్ని నెలలుగా బోర్డుకు లెక్చరర్లు, సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులతో ఇంటర్‌ విద్యామండలిలో నిధుల గోల్‌మాల్‌ వెలుగులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories