Roja: ఓటమి దిశగా రోజా.. ఊహించని ట్వీట్..

Roja towards defeat Unexpected tweet
x

Roja: ఓటమి దిశగా రోజా.. ఊహించని ట్వీట్..

Highlights

ఇక నగరిలో మంత్రి ఆర్‌కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్‌పై 5333 ఓట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. టీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉండగా.. రోజా ఓటమి దిశగా పయనిస్తున్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి.

Roja: ఏపీలో టీడీపీ-జనసేన కూటమి జోరు చూపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన కూటమి.. దాదాపు రాష్ట్రంలోని అన్ని చోట్ల క్లీన్‌స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్ధులు.. మొత్తం వైసీపీ సీనియర్లకు షాక్ ఇచ్చారు. వైసీపీ చెందిన అందరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూటమి హావా కొనసాగుతోంది.

ఇక నగరిలో మంత్రి ఆర్‌కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్‌పై 5333 ఓట్ల తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. టీడీపీ అభ్యర్ధి ముందంజలో ఉండగా.. రోజా ఓటమి దిశగా పయనిస్తున్నట్టు ట్రెండ్స్ చెబుతున్నాయి. ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు.

చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా… ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories