Chandrababu Naidu: సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల

Release of white paper on exploitation of natural resources
x

Chandrababu Naidu: సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల

Highlights

Chandrababu Naidu: ఐదేళ్లు సహజ వనరులను దోపిడి చేశారు

Chandrababu Naidu: వైసీపీ నేతలు ఐదేళ్లలో సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవులను సైతం గత ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. సహజవనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారని ఆక్షేపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్రపన్నారని చంద్రబాబు మండిపడ్డారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయని చంద్రబాబు అన్నారు. ప్రకృతి సంపద ప్రజలకు చెందాలన్నారు. అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తామని చంద్రబాబు అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories