Relaxation forJunior College Staff in AP: కాలేజీకి వారానికి రెండు రోజులే.. జూనియర్ కాలేజీల సిబ్బందికి సడలింపు

Relaxation forJunior College Staff in AP: కాలేజీకి వారానికి రెండు రోజులే.. జూనియర్ కాలేజీల సిబ్బందికి సడలింపు
x
Junior Colleges in AP
Highlights

Relaxation forJunior College Staff in AP: కరోనా మహమ్మారి విలయతాండవంతో ఏపీలో అన్ని పనులకు ఆటంకం ఏర్పడింది.

Relaxation forJunior College Staff in AP: కరోనా మహమ్మారి విలయతాండవంతో ఏపీలో అన్ని పనులకు ఆటంకం ఏర్పడింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరిగడంతో పాటు మరణాలు సైతం ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరిన్ని పనులను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఉపాద్యాయులంతా పాఠశాలలకు వెళ్లి హాజరు కావాలని ఆదేశించడం జరిగింది. అయితే రాష్ట్రంలో దానికి తగ్గట్టు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వెనుకడుగు వేసినట్టు కనిపిస్తోంది. . ఆగష్టు3 నుంచి పాఠశాలలన్నీ రిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా.

పాఠశాలల్లో ఇప్పటికే నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి సంబంధించి అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేసింది. ఈ పనులను నాణ్యతతో చేసేలా ప్రస్తుతం ఉపాధ్యాయులను పర్యవేక్షించేందుకు అప్పగించారు. దాదాపుగా మరో రెండు, మూడు నెలల్లో ఈ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే జూనియర్ కాలేజీలకు సంబంధించి కేవలం కాలేజీలకు వెళ్లి హాజరు వేసుకుని టీచింగ్ కు సంబంధించిన పనులను మాత్రమే పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే పరిస్థితుల్లో కేసులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరికి కొన్ని సడలింపులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొవిడ్‌-19 నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ సిబ్బంది వారానికి రెండు రోజులు 50 శాతం మంది హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఇంటర్‌ విద్యా స్పెషల్‌ కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారు. మిగతా రోజుల్లో 'వర్క్‌ ఫ్రం హోం'కు అవకాశం ఇచ్చారు. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్లలో ఉంటున్న వారికి కూడా విధుల నుంచి మినహాయింపులు ఇచ్చినట్లు అయన చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories