Andhra Pradesh: తాడిపత్రిలో ఎక్స్ అఫిషియో దరఖాస్తుల తిరస్కరణ

Rejection of Ex Officio Applications in Tadipati
x

ఫైల్ ఫోటో 

Highlights

Andhra Pradesh: ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు

Andhra Pradesh: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎక్స్‌అఫీషియో ఓటు కోసం టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు చేసుకున్న దరఖాస్తును మున్సిపల్‌ కమిషనర్‌ తిరస్కరించారు. ఎమ్మెల్సీలు గోపాల్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, ఇక్బాల్ అహ్మద్‌, శమంతకమణికి ఎక్స్‌అఫీషియో ఓటు అర్హత లేదని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రమే ఎక్స్‌అఫీషియో ఓటు అర్హత ఉంటుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రాయదుర్గంలో ఓటు హక్కుతో ఎమ్మెల్సీ అయ్యారని కమిషనర్‌ వివరించారు.

తాడిపత్రి మున్సిపాల్టీలోని 36 వార్డుల్లో రెండు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. వైసీపీకి ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 18కి చేరుతుంది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ సొంతబలం 19 అవుతుందని భావించారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ దీపక్‌ రెడ్డి ఓటును తిరస్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories