విశాఖలో రిజిస్ట్రేషన్ల జోరు!

విశాఖలో రిజిస్ట్రేషన్ల జోరు!
x
Highlights

సుందర సాగరతీరం పచ్చని వాతావరణం వెరసి హ్యాపనింగ్ సీటీ గా విశాఖ పేరు మార్మోగుతోంది. ప్రస్తుతం పరిపాలన రాజధానిగా ప్రచారం జరుగుతుండడంతో విశాఖలో గజం స్థలం...

సుందర సాగరతీరం పచ్చని వాతావరణం వెరసి హ్యాపనింగ్ సీటీ గా విశాఖ పేరు మార్మోగుతోంది. ప్రస్తుతం పరిపాలన రాజధానిగా ప్రచారం జరుగుతుండడంతో విశాఖలో గజం స్థలం వుంటే చాలు అనుకుని పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్నారు. స్థలాలు కొనుక్కుని సెటిల్ అవ్వాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగరంలో కరోనా సమయంలోను భూములు రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి.

విశాఖ నగరం పేరు చెబితే చాలు భూములు హాట్ కేకుల్లా అమ్ముడు వుతున్నాయి. ఆకర్షణీయమైన వాతావరణానికి తోడు, రానున్న రోజుల్లో ఎక్సిక్యూటీవ్ క్యాప్టిల్ గా మారనుండడంతో నగరంలో భూముల ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ప్రస్తుతం ద్వారకానగర్, జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో గజం ధర అక్షరాల లక్ష రుపాయలు పలుకుతుంది. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, దసపల్లా హిల్స్, డాబాగార్డెన్స్ వంటి ప్రాంతాల్లో 90 వేల వరకు వుంది. అదే శివారు ప్రాంతాలు అయిన కొమ్మాది, మధురవాడ, సింహాచలం, పెందుర్తి, రుషికొండ, భీమిలి ప్రాంతాల్లో గజం ధర 40 వేల నుండి 60 వేల మధ్యలో పలుకుతుంది. దీంతో కరోనా లాక్ డౌన్ సమయంలో ఓ మూడు నెలలు రిజిస్ట్రేషన్లు నెమ్మిదించినా ప్రస్తుతం మళ్లో జోరుగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

అయితే గత కొన్ని నెలలు క్రితం విశాఖలో భూ కుంభకోణాలు పెట్టుబడులు పెట్టే వారిని భయపెట్టాయి. దీంతో కాస్త నెమ్మిదించినా, నగర ప్రాదాన్యతలు, అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్టుబడులు మాత్రం తగ్గలేదు ప్రస్తుతం పరిపాలన రాజధాని ప్రచారంతో భూముల క్రయవిక్రయాల జోరు మరింత పెరిగింది. లాక్ డౌన్ 46 రోజుల అనంతరం రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకున్నా, కోవిడ్ నేపద్యంలో రెండు నెలల పాటు రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో గత ఫైనాన్సియల్ ఇయర్ కన్నా ఈఏడాది 45% రిజిస్ట్రేషన్లు తగ్గిపోవడంతో ఆ శాఖ కు ఆదాయం తగ్గింది. అయితే జూలై లో మాత్రం రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. ఓ వైపు కోవిడ్ భయపెడుతున్నా క్యాప్టిల్ ఫోకస్ తో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 5,507 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 4,500 డాక్యూమెంట్ల ను రిజస్ట్రర్ చేసారు. సుమారు 45 కోట్ల రుపాయలు వరకు ఆదాయం వచ్చింది. మధురవాడ, ఆనందపురం, పెందుర్తి, భీమిలి ప్రాంతాల్లో రెసిడెన్సియల్ ప్లాట్ల విక్రయాలు బాగా పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా విశాఖ పరిపాలన రాజధాని కాబోతున్న తరుణంలో భూముల క్రయవిక్రయాలకు మంచి డిమాండ్ వుండటంతో రిజిస్ట్రేషన్ల జోరు మాత్రం కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories