Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Reduced Crowd Of Devotees In Tirumala
x

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Highlights

Tirumala: ఖాళీగా దర్శనమిస్తున్న సర్వదర్శనం కంపార్ట్‌మెంట్లు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. దీంతో తిరుమలలోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఈరోజు తిరుమల వచ్చిన వారికి సులభంగానే దర్శనం లభిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు గంటల్లో స్వామి వారి దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు.

ఉచిత దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 86వేల 241 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31వేల 730 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories