AP Polling: ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు.. ఐదు గంటలకే 67.99 శాతం పోలింగ్

Record Voting In AP 67.99 Percent Polling In Five Hours
x

AP Polling: ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు.. ఐదు గంటలకే 67.99 శాతం పోలింగ్

Highlights

80శాతం పోలింగ్ నమోదు అవుతుందని అంచనాలు

AP Polling: ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. పల్లెలు, పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని గమనిస్తే గత మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పోలింగ్ ట్రెండ్‌ ప్రకారం 80 శాతం ఓటింగ్ దాటేలా కనిపిస్తోంది. 2014 ఏపీ ఎన్నికల్లో 78.4 శాతం, 2019 శాసనసభ ఎన్నికల్లో 79.6 శాతం మేర పోలింగ్ నమోదైంది. 2024లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే 67.99 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఈసారి పోలింగ్ 80 శాతం దాటేలా కనిపిస్తోంది.

ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరింటితో ముగిసింది. అయితే గడువు ముగిసినప్పటికీ క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఇక వర్షం పడుతున్నా, హింసాత్మక ఘటనలు జరుగుతున్నా లెక్కచేయక ఓటర్లు.. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.13 కోట్లు కాగా.. సాయంత్రం ఐదు గంటలకు 2.71 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 64.28 శాతం, మహిళలు 66.84 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories