Land On Moon: చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. రెండెకరాల భూమి కొన్న కృష్ణా జిల్లా వాసి..

Real Estate On The Moon
x

Land On Moon: చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. రెండెకరాల భూమి కొన్న కృష్ణా జిల్లా వాసి..

Highlights

Land On Moon: భారత్ చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ తో జాబిల్లిపై మరింత ఆసక్తి

Land On Moon: ప్లాట్ ఫర్ సేల్. ఇదేదో కోకాపేటలోనో, జూబ్లీహిల్స్ లోనో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మేము చెప్పేది చంద్రుడిపై జాగ కోసం. భూమిపై స్థలం కొంటే అందులో కిక్కే ముంది. అందుకే కొంతమందిపై ఏకంగా చంద్రుడిపైనే కన్నేశారు. జాబిల్లిపై స్థలం కొనేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. చందమామపై జాగ కొని.. తమ కుటుంబ సభ్యులకు గిఫ్ట్ గా ఇస్తున్నారు. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో.. మూన్ పై ప్రపంచ దేశాలకు మరింత ఆసక్తి పెరిగింది. దీంతో మామకు ఇప్పుడు మస్త్ గిరాకీ పెరిగింది. చంద్రుడిపై జాగ కొనేందుకు తెగ పోటీ పడుతున్నారు జనం. లక్షలు పెట్టి మరీ.. అక్కడి స్థలాన్ని తమ పేరున.. రిజిస్ట్రర్ చేసుకుంటున్నారు. తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి..ఏకంగా జాబిల్లిపై 2ఎకరాల స్థలాన్ని కొని.. తమ కూతుళ్లకు బహుమతి ఇచ్చారు.

భూమిపై జాగ ఉండటం ఇప్పుడు వెరీ కామన్. అదే చంద్రుడిపై స్థలం ఉండని చెప్పుకుంటే.. ఆ మజానే వేరు కదా. అందుకే ఎన్ని లక్షలు పోసైనా అక్కడ జాగను సొంతం చేసుకుంటున్నారు. చందమామపై తనకూ ల్యాండ్ ఉందంటూ గర్వంగా చెప్పుకునేందుకు.. ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రుడిపై నివాస యోగ్యం కోసం పరిశోధనలు ఊపందుకున్నాయి. ఇండియా పంపిన చంద్రయాన్ -3 మిషన్ తో అక్కడి వాతావరణ పరిస్థితిపై కీలక సమాచారం సేకరించింది ఇస్రో. చంద్రుడిపై ఆక్సిజన్, ఇతర లోహాలను గుర్తించడంతో.. భవిష్యత్తులో చంద్రుడిపై నినాసం ఎంతో దూరం లేదని చెప్పాలి. అందుకే చంద్రుడిపై జాగల కొనేందుకు.. జనం ఆసక్తి చూస్తున్నారు.

కృష్ణ జిల్లా వీరవల్లికి చెందిన NRI జగన్నాథరావు చంద్రుడిపై 2 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. భవిష్యత్తులో చంద్రుడిపై కాలు మోపాలనే కోరికతో తన ఇద్దరి కుమార్తెల కోసం చంద్రుడిపై జాగ కొన్నట్టు చెప్పుకొచ్చారు ఆయన. ఉద్యోగరీత్యా USA వెళ్లిన ఆయన 2005లో లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ గురించి తెలుసుకున్నారు. చంద్రమండలానికి.

సంబంధించిన క్లెయిమ్ డీడ్ ను లూనార్ రిపబ్లిక్ సొసైటీ చేస్తుందని తెలిసి, న్యూయార్క్ లోని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తన ఇద్దరి కుమార్తెల పేర్లపై 2ఎకరాల జాగను కొనుగోలు చేశారు. చంద్రునిపై అంతర్జాతీయ పరిశోధన సంస్థలు గుర్తించిన ప్రాంతాల పేర్లను ల్యాండ్ పార్సిల్ నంబర్లతో ముద్రించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. చంద్రుని ఉపరితలం మ్యాప్ ను జగన్నాథ్ రావుకి అందజేశారు. ఏయే అక్షాంశాలు, రేఖాంశాల మధ్య కొనుగోలు చేసిన భూమి ఉందో.. లూనార్ ల్యాండ్స్ స్పష్టంగా పేర్కొంటూ జగన్నాథరావుకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇటీవల భారత్ కు చెందిన ఓ మహిళ కూడా ఇలాగే చందమామపై జాగ కొనేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories