Ramesh Babu On Swarna Palace Incident: స్వర్ణాప్యాలెస్ ఘ‌ట‌నపై స్పందించిన రమేష్ హాస్పిటల్స్ అధినేత

Ramesh Babu On Swarna Palace Incident: స్వర్ణాప్యాలెస్ ఘ‌ట‌నపై స్పందించిన రమేష్ హాస్పిటల్స్ అధినేత
x
Highlights

Ramesh Babu On Swarna Palace Incident: కోవిద్ బాధితులున్న హోటల్ లో జరిగిన ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం విచారణకు రెండు కమిటీలను నియమించిన విషయం తెలిసిందే.

Ramesh Babu On Swarna Palace Incident: కోవిద్ బాధితులున్న హోటల్ లో జరిగిన ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం విచారణకు రెండు కమిటీలను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నేపథ్యంలో హోటల్ కు సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఇచ్చిన అనుమతులపై కమిటీలు విచారణ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం బాదిత కుటుంబాలకు రూ. 50లక్షల చొప్పున పరిహారం మంజూరు చేయగా, కేంద్రం రూ. 2 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై ఏపీ సీఎం జగన్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అయతే, రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు ఈ ఘటనపై స్పందిస్తూ.. స్వర్ణాప్యాలెస్ లో ఘటన నేపధ్యంలో నేను మీ ముందుకురావాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలలుగా కోవిడ్ పై శ్రమిస్తున్నాయి. కోవిడ్ సమయంలో ప్రైవేట్ పబ్లిక్ రంగంలో ఉన్న వైద్య సంస్థలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. శాస్ర్తీయ వైద్యలోపంతో పాట ఆర్.టి. పీసీఆర్ 30శాతం మందికి ఫాల్స్ నెగెటివ్ రావడం వలనే ఈ వ్యాధి పక్కవారికి సోకడానికి దోహదపడింది. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని హాస్పటల్స్ గానే సామాజిక భాద్యతగా భావించి వైద్యం చేయడానికి ముందుకు వచ్చాం.

కోవిడ్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో జిల్లా కలెక్టర్ ఆసుపత్రి యాజమాన్యులతో చర్చలు జరిపి కోవిడ్ పేషెంట్లను తిప్పి పంపవద్దని సూచించారు. ఈ నేపధ్యంలోనే మేము కోవిడ్ సెంటర్స్ ను తెరిచాము, విజయవాడ యంజి రోడ్, ఒంగోలు లోని రమేష్ సంఘమిత్ర హాస్పటల్లో కోవిడ్ బెడ్ లు ఏర్పాటు చేశాం. యంజి రోడ్ లోని హాస్పటల్ ను మూడు నెలల క్రితం డియం హెచ్ వో తనిఖీ చేసి ముందుకు వెళ్లవచ్చని చెప్పారు.

పదిరోజుల్లో మా హాస్పటల్ లో బెడ్లు మొత్తం నిండిపోయాయి. మాకు వచ్చిన కేసుల్లో పది శాతం మందికి మాత్రమే చికిత్స అందించగలుగుతున్నాము... మిగతా 90 మందిని వేరే హాస్పటల్ కు వెళ్లాల్సిందిగా చెబుతున్నాము. డిశ్చార్జ్ అయినా కూడా వెళ్లేందుకు కొంతమంది భయపడుతున్నారు. దీంతో వీరితో పాటు మైల్డ్ కరోనా యాక్టివ్ అయిన వారిని రెండు, మూడు రోజుల పాటు హోటల్స్ లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నాము ఇందుకు కలెక్టర్, డియంహెచ్ వో వారి అనుమతి కూడా తీసుకున్నాం.

ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని తమ సిబ్బందికి ఆదేశించాం. మా సిబ్బందికి కూడా నర్సులకు, డాక్టర్స్ కి మూడు రెట్లు అధికంగా జీతాలు చెల్లిస్తున్నాం. నిష్పక్షపాతంగా న్యాయవిచారణకు రమేష్ హాస్పటల్ సిద్దంగా ఉంది. డియంహెచ్ వో పర్మిషన్ తో ప్లాస్మా థెరపీని కూడా ఎంతోమంది రోగులకు అందజేశాం. 2012లో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో తొలి ఫైర్ ఎన్ ఓ సి పొందిన హాస్పటల్మాదే. అదే విధంగా పేషెంట్స్ సేఫ్టీలో ఇంటర్నేషనల్ స్టాండర్స్ ప్రామాణికంగా జెసిఎ సర్టిపికేషన్ పొందిన ఏకైక ఆసుపత్రి మాది. అంటూ ఘ‌ట‌నపై స్పందిస్తూ.. రమేష్ బాబు మాట్లాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories