Ram Gopal Varma: నాపై కేసులు కొట్టేయండి.. ఏపీ హైకోర్టులో ఆర్జీవి పిటిషన్

Ram Gopal Varma Moves AP High Court to Quash Case Registered Against Him
x

Ram Gopal Varma: నాపై కేసులు కొట్టేయండి.. ఏపీ హైకోర్టులో ఆర్జీవి పిటిషన్

Highlights

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం నాడు మరో పిటిషన్ దాఖలు చేశారు.

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం నాడు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్స్ లో తాను చేసిన పోస్టులపై చట్టవిరుద్ధంగా కేసులు నమోదు చేస్తున్ారని ఆ పిటిషన్ లో ఆయన చెప్పారు. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయవద్దని ఆదేశించాలని ఆ పిటిషన్ లో ఆయన కోరారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కూడా ఆయన ఆ పిటిషన్ లో కోరారు. మరో వైపు తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

ఈ ఏడాది మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూద టీడీపీ, జనసేన కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్ లతో పాటు తెలంగాణలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై 9 కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరు కాలేదు. నాలుగు రోజులుగా ఆయన పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఏపీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నవంబర్ 27న విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్లపై విచారణ నవంబర్ 28న జరిగే అవకాశం ఉంది.

నా సినిమాలు ఒక్క ఓటును ప్రభావితం చేయలేదు

చంద్రబాబు, లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తారని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. 164 సీట్లతో రికార్డు స్థాయిలో గెలవడమే అసలైన ప్రతీకారంగా ఆయన చెప్పారు. తన సినిమాలు, పోస్టులు ఒక్క సీటును కూడా ప్రభావితం చేయలేకపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories