Rajahmundry Old Railway Bridge: 120 ఏళ్లు పూర్తిచేసుకున్న రాజమండ్రి పాత వంతెన..

Rajahmundry Old Railway Bridge: 120 ఏళ్లు పూర్తిచేసుకున్న రాజమండ్రి పాత వంతెన..
x

Rajahmundry Old Railway Bridge

Highlights

Rajahmundry Old Railway Bridge| ప్రస్తతం రాజమండ్రిపై మూడు రాజమండ్రి వద్ద నాలుగు వంతెనలున్నాయి.

Rajahmundry Old Railway Bridge| ప్రస్తతం రాజమండ్రిపై మూడు రాజమండ్రి వద్ద నాలుగు వంతెనలున్నాయి. వీటిలో మూడు రైళ్లు ప్రయాణించేవి కాగా, ఒకటి ఇతర భారీ వాహనాలు ప్రయాణించేలా నిర్మాణం చేశారు. అయితే ఈ నాలుగింటిలో ముందుగా నిర్మాణం చేసింది హావలాక్ వంతెన. ఇది నిర్మించి ఇప్పటికి 120 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 1900వ సంత్సరంలో దీనిని అప్పటి మద్రాసు గవర్నర్ అర్ధర్ ఎలిబంక్ హేవలాక్ పేరుమీద దీని నిర్మాణం చేయడం జరిగింది.

చరిత్ర ప్రవాహంలో శతాబ్ధపు సేవలకు జ్ఞాపకంగా నిలిచింది.. అఖండ గోదావరిపై అందంగా హోయలు పోతూ..ఆ దరిని ఈ దరిని కలిపిన వారధి. దేశంలో దక్షిణాది ప్రాంతాన్ని తూర్పుతో అనుసంధానం చేస్తూ..అనుబంధాన్ని కలిపిన బంధం. శతాబ్ద కాల అనుబంధం ఉన్న ఈ వారధి కేవలం ఇటుక, కాంక్రీటు కలబోత మాత్రమే కాదు.. గోదావరి నడుమ ఒయ్యారంగా అబ్బురపరిచే అందంతో జన ప్రయాణానికి సహకరించి చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సాధించింది. ప్రస్తుతానికి విహార తోరణంగా, ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనంగా పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై నిర్మించిన తొలి అద్భుత కట్టడం హేవలాక్‌ వంతెన.. గోదావరిపై తొలి రైలు వంతెనను సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పర్యవేక్షణలో ౧౮౯౭ నవంబర్ 11న ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైనది. దీనిని ఎఫ్‌.టి.జి. వాల్టన్‌ అనే ఇంజినీరు పర్యవేక్షించారు. అప్పట్లో వంతెన నిర్మాణానికి రూ. 50,40,457గా అంచనా వేయగా,.. అయిన ఖర్చు మాత్రం రూ. 46,89,849తో 1900 సంవత్సరంలో పూర్తిచేశారు. అప్పటి మద్రాస్ గవర్నర్ అయిన సర్ అర్ధర్ ఎలిబoక్ హేవలాక్ పేరు మీద ఈ వంతెన హవేలాక్ వంతెన గా పిలవబడింది. ప్రస్తుతం ఈ వంతెన ఇంజనీరింగ్ పర్యాటక ప్రదేశం గా మార్చబడినది.

56 స్తంభాలతో 2.95 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన వందేళ్లు పూర్తిచేసుకోవడంతో 1997లో ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ఈ అద్భుత కట్టడం సందర్శకులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. జీవిత కాలం సేవలందించి 120 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ వంతెన నేటికీ చెక్కుచెదరలేదు. రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరిపై తొలి వంతెనకు 120 ఏళ్లు వచ్చాయి. అదే హేవలాక్‌ బ్రిడ్జి. దీనిని 1897 నవంబరు 11న నిర్మాణ పనులు ప్రారంభించారు. దీని పొడవు 2,700 మీటర్లు ఉంది. 1900 ఆగస్టు 6న తొలి రైలు హౌరా మెయిల్‌ ప్రయాణించింది. అయితే అదే నెల 30న మద్రాసు గవర్నర్‌ హేవలాక్‌ దీన్ని ప్రారంభించారు. 1997లో ఈ బ్రిడ్జిని మూసేసిన తర్వాత రైల్వే శాఖ మొత్తం ఊడపీక్కునిపోవడానికి ప్రయత్నించింది. స్థానిక ప్రజలు ఈ బ్రిడ్జిని కాపాడుకోవడానికి ఉద్యమించారు. చారిత్రాత్మక హేవలాక్‌ బ్రిడ్జిని స్మారక కట్టడంగా మార్చాలని ప్రతిపాదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories