Andhra Pradesh: రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమకు వర్ష సూచన

Rainfall for Costa, Rayalaseema
x
Andhra Pradesh:(File Image)
Highlights

Andhra Pradesh: రానున్న 24గంటల్లో కోస్తా,రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

Andhra Pradesh: రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా తూర్పు మధ్య భారతాల్లో మరో రెండు ఆవర్తనాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. దీంతో ఏపీలో భిన్న వాతావరణం ఏర్పడింది. ఓపక్క ఎండలు మండుతోంటే మరోపక్క వర్షాలు పడటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. వీటన్నింటి ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితంపైకి మేఘాలు ఆవరించడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి.

ఉత్తరకోస్తాలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. కర్నూలు జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పలుచోట్ల వరి, మమిడి పంటలకు దెబ్బ తగిలింది. కాపుకు వస్తున్న సమయంలో ఈ భారీ వర్షంతో పండ్లు నేలరాలాయి. కర్నూలు జిల్లాలో అకాలవర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడంతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. అరటి, పామాయిల్‌ చెట్లు కూలిపోయాయి. మామిడి, జీడి మామిడి తోటలకూ అపార నష్టం వాటిల్లింది. రానున్న 24గంటల్లో కోస్త,రాయలసీమల్లో ఈదురుగాలులు,ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories