AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rainfall Alert For Andhra Pradesh Next 24 Hours
x

AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Highlights

AP Rain Alert: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయని ఐఎండీ అమరావతి కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియరిక్ స్థాయి వరకు విస్తరించిందని తెలిపింది.

ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉండడం వల్ల, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తుందని, ఈ నెల 16 నాటికి వాయుగుండగా మారే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి కేంద్రం వివరించింది. అల్పపీడనం ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని, ఈ నెల 14, 15 తేదీల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories